EPAPER
Friday, September 4, 2026
Google search engine

శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన నిర్వాహకులు

📰 Generate e-Paper Clip

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 29:

 

త్రైత సిద్ధాంతం–ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక బంగారుపాళ్యం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ఊరేగింపునకు పూతలపట్టు ఎమ్మెల్యే కే.మురళీమోహన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను శనివారం చిత్తూరు లోని ఎమ్మెల్యే స్వగృహంలో అందజేసి కార్యక్రమానికి హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. బంగారుపాళ్యం లో సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, సెప్టెంబర్‌ 9న మధ్యాహ్నం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఊరేగింపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అదేవిధంగా పాలేరుగ్రామంలో సెప్టెంబర్‌ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి ఊరేగింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.మురళీమోహన్‌ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు తప్పక హాజరవుతానని, తన అనుచరులు కూడా కార్యక్రమంలో పాల్గొనేలా ఆహ్వానించాలని నిర్వాహకులకు తెలిపారు. కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం–ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక బంగారుపాళ్యం కమిటీ అధ్యక్షుడు ధనుంజయ, సభ్యుడు డి.బాలాజీతో పాటు మునిరత్నం, హర్షవర్ధన్‌, ఉదయ్‌, సరళదేవి, నాగమ్మ, శాంతమ్మ, రేణుకదేవి, డివిత, వాణిశ్రీ, తులసి, రెడ్డెమ్మ, చాముండేశ్వరి, లత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!