
శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు29:
శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలోని ఎంజీఎం జూనియర్ కళాశాల సీఈసీ విద్యార్థి పీఎంకే. తేజో మారుతి ప్రసాద్ టైక్వాండోలో కాంస్య పతకం సాధించి కళాశాలకు పేరు తీసుకొచ్చాడు. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో పాల్గొని ఈ ఘనత సాధించాడు.ఈ సందర్భంగా ఎంజీఎం ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ గుడ్లూరు ఐశ్వర్య మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో చదువుతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తేజో మారుతి ప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి.ఎస్. రత్నం తదితరులు పాల్గొని విద్యార్థిని అభినందించారు.


Recent Comments