EPAPER
Friday, September 4, 2026
Google search engine

విద్యా ప్రస్థాన వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

పలమనేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 29:

 

పలమనేరు మండలం మండిపేట కోటూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌ 6న నిర్వహించనున్న విద్యా ప్రస్థాన (రూబీ జూబ్లీ) వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు ఆహ్వానించారు. శనివారం పలమనేరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం, విశ్రాంతి ఉపాధ్యాయుల సత్కారం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పాఠశాల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రత్యేక అతిథుల ప్రసంగాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షుడు ఆర్వీ బాలాజీ, టీడీపీ సీనియర్ నాయకులు జగదీష్ నాయుడు, మోహన్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!