EPAPER
Sunday, October 18, 2026
Google search engine

అంగన్వాడి కేంద్రాల్లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

📰 Generate e-Paper Clip

హిందూపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 06:

 

హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం చోళసముద్రం సెక్టార్ పరిధిలోని మానేపల్లి గ్రామ పంచాయతీతో పాటు హిందూపురం మండలంలోని చలివెందల గ్రామంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీడీపీవో సుధా వరలక్ష్మి ఆదేశాల మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత, శిశువులకు తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పోతపాల వల్ల కలిగే నష్టాలు, తల్లిపాలు ఎంతకాలం ఇవ్వాలి, వ్యక్తిగత పరిశుభ్రత, తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. అనంతరం తల్లులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు మెహతాజ్, అరుణ, పార్వతమ్మ, ఆశ కార్యకర్తలు నరసమ్మ, తిమ్మక్క, నాగవేణి, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తల్లులు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!