శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కేంద్రంగా శ్రీహరి కళ్యాణ మండపంలో శ్రీ కాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ ఈర్ల.రాజా మాదిగ గారు ఏర్పాటుచేసిన తిరుపతి జిల్లా ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి సమావేశంలో అనుబంధ సంఘాల సమావేశానికి ముఖ్యఅతిథిగా తిరుపతి జిల్లా ఇంచార్జ్ వర్ల దేవదాస్ మాదిగ గారు విచ్చేసి ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాల్లో నిర్వహించినటు వంటి జండా ఆవిష్కరణలు మరియు కమిటీలు మిగిలిన వివిధ అంశాలపై చర్చించుకుని తదుపరి కార్యచరణ మిగిలినటు వంటి గ్రామాలలో కూడా ఈనెల ఆఖరిలోగా జెండా ఆవిష్కరణలు జరగాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు సమాజం కోసం చేసిన సేవలు మరియు కార్యక్రమాలను గురించి చర్చించుకుని మరింత బలంగా ఎమ్మార్పీఎస్ గ్రామ గ్రామాల్లో బలోపేతం చేయాలని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో
శ్రీకాళహస్తి యువసేన అధ్యక్షుడు మన్నేపల్లి ఈశ్వర్ మాదిగ, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు పాలూరి వెంకట ముని మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎన్. బాలరాజు మాదిగ, జి.మోహన్ మాదిగ, కృష్ణయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.



Recent Comments