EPAPER
Thursday, August 20, 2026
Google search engine

మాజీ సైనికుల కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలి సమస్యల పరిష్కారంపై మాజీ సైనిక ఉద్యోగుల సంఘం సమావేశంలో తీర్మానం

📰 Generate e-Paper Clip

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 12 :

 

కుప్పం పట్టణంలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు రవిచంద్ర, ఉపాధ్యక్షుడు రామమూర్తి, ప్రధాన కార్యదర్శి దేవరాజు ఆధ్వర్యంలో ఆదివారం మాజీ సైనిక ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ సైనికుల సంక్షేమం, ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని మాజీ సైనికులే చందాలు సమీకరించి ప్రారంభించామని తెలిపారు. అయితే తగినంత నిధులు లేకపోవడంతో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాజీ సైనికుల కమ్యూనిటీ భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఇటీవల సంబంధిత ఎంపీని కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ అంశంపై ఎంపీ సానుకూలంగా స్పందించి, త్వరితగతిన నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంపై మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి మాజీ సైనికుల సేవలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. సమావేశంలో మాజీ సైనికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి మాజీ సైనికుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు.

 

 

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!