EPAPER
Thursday, August 20, 2026
Google search engine

అధికారులు బాధ్యతగా పనిచేయాలి అధికారులు గ్రామాలలో క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలు పరిష్కరించాలి  కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయుచున్నాము రాబోయే మూడు నెలలలో కుప్పం నియోజకవర్గం వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

📰 Generate e-Paper Clip

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూలై 05:

 

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలు, కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. జిల్లాలో మూడో రోజు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కుప్పంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు,అనంతరం ముఖ్యమంత్రి వర్యులు జిల్లా అభివృద్ధిపై ఆయా శాఖల పనితీరుపై , కుప్పం నియోజకవర్గానికి సంబంధించి సంబంధిత శాఖ అధికారులతో ప్రజల సంతృప్తి స్థాయిపై సమీక్షించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ. సేవల పర్యవేక్షణ నియోజకవర్గంలో ప్రభుత్వ సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రత్యేక తనిఖీ బృందాలు మరింత యాక్టివ్‌గా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.ప్రజల్లో పెరిగిన సంతృప్తి గతంతో పోలిస్తే ప్రభుత్వ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. గతంలో 69 శాతంగా ఉన్న సంతృప్తి స్థాయి, ఇప్పుడు 72 శాతానికి చేరిందని తెలిపారు, జిల్లాలో కొన్ని శాఖల అధికారులను పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు,వాటిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్,దేవాదాయ ధర్మాదాయశాఖ,రీ సర్వే, ఆర్ ఓ ఆర్, స్కూల్ ఎడ్యుకేషన్,సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంధనం,విద్యుత్తు,ఎన్టీఆర్ భరోసా,ఆర్టీసీ,కాలేజీఎడ్యుకేషన్ రెవిన్యూ అండ్ రిజిస్ట్రేషన్,దీపం,హౌసింగ్,సాగునీటి,రూరల్ పంచాయతీ,పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్,ఫైర్ సర్వీస్,రాబోయే అక్టోబర్ నాటికి శాఖలతీరు రాష్ట్రస్థాయిలో మంచి ఫలితాలు సాధించాలని ఆదేశించారు, మంచి ఫలితాలు సాధించిన శాఖలను ముఖ్యమంత్రి వర్యులు ప్రశంసించారు, బీసీ సంక్షేమ శాఖ,అన్న క్యాంటీన్,డ్రైవింగ్ లైసెన్సు,రీ సర్వే, గర్భిణీ స్త్రీలు, మరియు బాలింతలకు అందిస్తున్న సేవలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, మిడ్ డే మీల్స్, సీఎం రిలీఫ్ ఫండ్ మంచి ఫలితాలు సాధించాయని తెలిపారు అధికారులను ప్రోత్సహించాలని తెలిపారు, కుప్పం నియోజకవర్గ ప్రజల సంతృప్తి స్థాయిలో 90% ఉండేవిధంగా అధికారుల కృషి చేయాలని తెలిపారు, ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే పోటీల్లో నిర్వహించుచున్నానని పేర్కొన్నారు రాబోయే అక్టోబర్ నాటికి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ప్రజల సంతృప్తి స్థాయి 90 శాతం ఉండే విధంగా అధికారుల కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డి .ప్రసాదరావు, జిల్లా కలెక్టర్, సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డు డి జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్, కడపిడి వికాస్ మరమత్, జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ అధికారులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!