
హిందూపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 01:
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుదవారం స్థానిక జిల్లా స్థాయి ప్రభుత్వాసుపత్రిలో మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బీసీ రాయ్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా జూలై 1 న వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం 1991 నుండి అధికారికంగా ఈ దినోత్సవాన్ని జరుగుతున్నట్లు చెప్పారు. న్యాయవాదులు మాట్లాడుతూ వృత్తిలో వైద్యులు క్షణం తీరిక లేకుండా ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. వైద్యుల సేవలకు కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుందని చెప్పారు. ప్రధానంగా కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఎంతోమంది ప్రజలను కాపాడారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి సూపరిండెండెంట్ డాక్టర్ రాజగోపాల్, ఆర్ఎంఓలు డాక్టర్ చరణ్, డాక్టర్ ప్రసాద్, న్యాయవాది కదిరి కుమార్, లోక్ అదాలత్ సిబ్బంది రాజా, పారా లీగల్ వాలంటీర్లు మార్గదర్శి మాళప్ప, చంద్రకాంత్, సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments