EPAPER
Sunday, October 18, 2026
Google search engine

బూత్-168లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిమ్ దాము

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్ 30:

 

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని మర్రిమాను వీధి ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని బూత్ నంబర్-168లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 19వ వార్డు కౌన్సిలర్ జిమ్ దాము మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో కలిసి ఇంటింటికీ నిర్వహిస్తున్న ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి, పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపీనాథ్, బూత్ ఇన్‌చార్జ్ చంద్ర, రాజా, రాధా, బుజ్జి, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!