EPAPER
Thursday, August 20, 2026
Google search engine

ఎంబీఏ ఫలితాల్లో కుప్పం ఇంజినీరింగ్ కళాశాల ప్రతిభ..  నాగలక్ష్మికి ప్రథమ స్థానం

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 27:

 

చిత్తూరు జిల్లా కుప్పంలోని కుప్పం ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్)లో ఏప్రిల్ నెలలో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఎంబీఏ నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులు 91 శాతం ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మరోసారి మంచి ఫలితాలను అందించారు. బీసీఎన్ విద్యాసంస్థల చైర్మన్ బి.సి.నాగరాజ్, వైస్ చైర్మన్ ఎన్.సునీల్ రాజ్, సెక్రటరీ ఎన్. సాగర్ రాజ్, జేఎన్‌టీయూఏ పరీక్షల పరిశీలకురాలు వి.బి.చిత్ర, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. సుధాకరబాబు, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. భాస్కరన్, ఎంబీఏ విభాగాధిపతి ఎన్. మునీంద్ర, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం. సోమసుందరం సంయుక్తంగా ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా చైర్మన్ బి.సి. నాగరాజ్ మాట్లాడుతూ, ఎంబీఏ నాల్గవ సెమిస్టర్‌లో 91 శాతం ఉత్తీర్ణత నమోదుకావడం గర్వకారణమన్నారు. అత్యధిక మంది విద్యార్థులు డిస్టింక్షన్, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం కళాశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. పరీక్షా ఫలితాల్లో బి.ఎల్. నాగలక్ష్మి 92.38 శాతం మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, ఎస్. దీప 91.25 శాతం మార్కులతో ద్వితీయ స్థానం, ఎస్. సౌమ్య శ్రీ 91.25 శాతం మార్కులతో తృతీయ స్థానం పొందారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను బీసీఎన్ విద్యాసంస్థల యాజమాన్యం అభినందించింది. వారి విజయానికి కృషి చేసిన అధ్యాపకులను కూడా ఈ సందర్భంగా ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో ప్రతిభ కనబర్చి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు చైర్మన్ బి.సి. నాగరాజ్, వైస్ చైర్మన్ ఎన్. సునీల్ రాజ్, సెక్రటరీ ఎన్. సాగర్ రాజ్, ఎంబీఏ విభాగాధిపతి ఎన్. మునీంద్ర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!