EPAPER
Thursday, August 20, 2026
Google search engine

బీజేపీ కార్యవర్గ సమావేశానికి కుప్పం నుంచి భారీగా తరలివెళ్లిన నాయకులు, కార్యకర్తలు

📰 Generate e-Paper Clip

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 27:

 

చిత్తూరులో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బీజేపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి డా. ఎన్.ఎస్.తులసీనాథ్ ఆధ్వర్యంలో ఈ బృందం సమావేశానికి హాజరై పార్టీ బలోపేతంపై జరిగిన చర్చల్లో పాల్గొంది.సమావేశంలో గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ప్రతి గ్రామంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, బూత్ స్థాయిలో కార్యకర్తలను మరింత చురుకుగా తీర్చిదిద్దడం, ప్రజలతో నిరంతర అనుసంధానం కొనసాగించడం వంటి అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత విస్తృతంగా చేరవేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి వాటి ప్రయోజనాలు అందేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీని గ్రామీణ స్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని నాయకులు సూచించారు. ఈ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!