శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయం నందు బేటి బచావో బేటి పడా వో కార్యక్రమం శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమం సి.డి.పి.ఓ శాంతి దుర్గ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సి.డి.పి.ఓ శాంతి దుర్గ మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చిట్టచివరి వ్యక్తి వరకు అందజేయాల్సిన బాధ్యత అంగన్వాడి కార్యకర్తలు టీచర్లు పై ఉందని అన్నారు. అంగన్వాడి పాఠశాలలకు ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ అంగన్వాడి స్కూళ్లలో చిన్నారులను చేర్పించే విధంగా అంగన్వాడి సూపర్వైజర్ల నుంచి అంగన్వాడి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ గ్రామాలలో , పట్టణంలో ఇళ్లవద్దకు వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అంగన్వాడి స్కూలు బలోపేతం అయ్యే విధంగా కృషి చేయాలని అని అన్నారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ శాంతి దుర్గ ,అంగన్వాడి సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Recent Comments