EPAPER
Thursday, August 20, 2026
Google search engine

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూన్ 23:

 

చిత్తూరు జిల్లా కుప్పం – గుడుపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుప్పం రైల్వే పోలీసుల కథనం మేరకు, జూన్ 22వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో మున్సిపల్ డంపింగ్ యార్డు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందజేయగా రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో అతను ఏదో బలమైన వ్యక్తిగత కారణంతో గుర్తుతెలియని రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, మరణానికి గల ఖచ్చితమైన కారణాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు లేదా అతడిని గుర్తించగలిగిన వారు కుప్పం రైల్వే పోలీసులను లేదా హెడ్ కానిస్టేబుల్ మొబైల్ నంబర్ 8074088806ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!