EPAPER
Thursday, August 20, 2026
Google search engine

పేద కుటుంబానికి అండగా యూనిట్ ఇన్‌చార్జి అప్పు ముకేశ్..  పెళ్లికూతురు తాళిబొట్టు ఖర్చుకు ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 24:

 

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట 14వ వార్డుకు చెందిన లక్ష్మీ–రఘు దంపతుల కుమార్తె గంగా వివాహానికి అవసరమైన తాళిబొట్టు ఖర్చును తెలుగుదేశం పార్టీ కొత్తపేట యూనిట్ ఇన్‌చార్జి అప్పు ముకేశ్ భరించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. లక్ష్మీ,రఘు దంపతులు గత 20 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తూ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కుమార్తె వివాహం నిర్వహించడం భారంగా మారడంతో సహాయం కోసం అప్పు ముకేశ్‌ను ఆశ్రయించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న అప్పు ముకేశ్ పెళ్లికూతురి తాళిబొట్టు ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వివాహం జరిగిన రోజునే రూ.11,106 ఆర్థిక సహాయాన్ని పెళ్లికూతురు గంగాకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. సమాజంలో ఉన్న పేద, బలహీన వర్గాల ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తూనే ఉంటామని తెలిపారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో, పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో వందేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!