EPAPER
Thursday, August 20, 2026
Google search engine

తిరుపతిలో జరుగు కూటమి విజయోత్సవ సభను విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 11:

 

ఎన్ డి ఏ ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లుపూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో జరగబోవు రెండేళ్ల పూర్తయిన కూటమి విజయోత్సవ సభకు భారీగా జన సమీకరణ కోసం యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గురువారం శాంతిపురం మండలంలో ప్రర్య టించారు ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు నందిగామ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నరసింహ యాదవ్ కు ఘనంగా స్వాగతం, సన్మానం పలికారు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నరసింహ యాదవ్ కి మాలలు వేసి సత్కరించారు ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకీర్ణ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది కూటమి రెండేళ్ల పాలన ప్రజా సంక్షేమానికి నిదర్శనం తిరుపతిలో జరిగే విజయోత్సవ సభ విజయం చేసేందుకు శాంతిపురం మండలం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో బీసీ యాదవ సోదరులకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు తిరుపతిలో జరగనున్న సభకు భారీగా రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇకార్యక్రమం లో పి కే యం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ సభ్యుడు విశ్వనాథ్, వివిధ నామినేట్ పదవుల్లో ఉన్న నాయకులు క్లస్టర్ ఇంచార్జ్లు, యూనిట్ఇన్చార్జిలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!