తొట్టంబేడు
తొట్టంబేడు మండలంలోని చిట్టత్తూరు గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి , చెత్తను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చడానికి ‘చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వంచే
ఏర్పాటుచేయబడ్డాయి. ఇవి గ్రామాల్లోని పర్యావరణాన్ని పరిరక్షించడమే కాక,పంచాయతీలకు ఆదాయ వనరులుగా కూడా ఉపయోగ పడుతున్నాయి. ఈపథకం
తొట్టంబేడు మండలంలోని చిట్టత్తూరు గ్రామం నందు క్షేత్రస్థాయిలో పురోగతి చెందింది. ఇక్కడ సచివాలయ సిబ్బంది ప్రతి ఉదయం గ్రీన్ అంబాసిడర్లతో కలిసి చెత్తను సేకరించి,వచ్చిన తడి చెత్త పొడి చెత్తతో సేంద్రీయ ఎరువును తయారు చేస్తూ. ఆ సేంద్రియ
ఎరువులు అతి తక్కువ ధరలకు రైతులకు అమ్ముతూ వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. సచివాల సెక్రటరీ శాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు
గ్రామీణ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ వారు ఇచ్చే వ్యర్ధపదార్థాలతో సంపద తయారీ కేంద్రం నందు సేంద్రీయ ఎరువుని తయారు చేస్తూ.ఆ ఎరువులు తమ
పంచాయతీలోని రైతులకు అతి తక్కువ ధరకు విక్రయిస్తూ వారికి సేంద్రియ వ్యవసాయంపై
అవగాహన కల్పిస్తూ, సేంద్రియ వ్యవసాయంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నామని, సేంద్రియ
వ్యవసాయం వల్ల తమ పంచాయతీలోని రైతులు నేడు అధిక దిగుబడితో లాభాలు కూడా
గడిస్తున్నారని తెలియజేశారు.గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీలో మండల అధికారి మరియు సచివాలయం సిబ్బంది చెత్త సేకరణతో చేస్తున్న సేంద్రీయ ఎరువుతో తాములేడు వ్యవసాయానికి సేంద్రియ ఎరువును వాడుతూ అధిక దిగుబడితో
పాటు అధిక లాభాలను కూడా గడుస్తున్నామని ఇలాంటి మంచి మంచి పథకాలు ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.


Recent Comments