EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

📰 Generate e-Paper Clip

జడ్చర్ల,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే29:

 

జడ్చర్లమున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా చీరలను పంపిణీ చేస్తూ,ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీరలను అందజేసి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరీష్, మేనేజర్ లక్ష్మన్న, టీఎంసీ వరలక్ష్మి, టౌన్ అధ్యక్షురాలు శ్వేత, మాజీ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ చైతన్య చౌహన్, మాజీ కౌన్సిలర్ కుమ్మరి రాజు, మీనాజ్, మాజీ ఎంపీటీసీ అశోక్, మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు, పట్టణ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడగా, లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!