EPAPER
Thursday, August 20, 2026
Google search engine

కుప్పంలో ఈ-సైకిల్స్ సర్వీస్ మరియు సేల్స్ సెంటర్ ప్రారంభం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్,కడ పిడి వికాస్ మర్మత్ 

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 27:

 

చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ-సైకిల్స్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ-సైకిల్స్ సర్వీస్ అండ్ సేల్స్ సెంటర్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, కడ రాజకీయ ఛైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంచిన సేవలపై వివరాలు తెలుసుకున్నారు. 2026 జనవరిలో కుప్పం ప్రాంత ప్రజలకు సబ్సిడీ ధరలతో, బ్యాంకు రుణాల సహాయంతో 5 వేలకుపైగా ఈ-సైకిల్స్ పంపిణీ చేయడం ద్వారా కుప్పం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాంతంలో ఈ-సైకిల్స్ వినియోగం గణనీయంగా పెరిగింది. రెండో దశ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ సెంటర్ ద్వారా కొత్త ఈ-సైకిల్స్ విక్రయాలతో పాటు బ్యాటరీ మార్పులు, రిపేర్లు, సర్వీసింగ్, విడిభాగాల సరఫరా, టెక్నికల్ సపోర్ట్ వంటి సేవలను ఒకేచోట అందించనున్నట్లు తెలిపారు. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం, ప్రజల రవాణా ఖర్చులను తగ్గించడం, ఆధునిక సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!