
పీలేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 27:
పీలేరులోని వీఎస్‌ఎన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు వడ్లమూడి శ్రీనివాసులు నాయుడు 15వ వర్ధంతి సందర్భంగా బుధవారం అన్నా క్యాంటీన్‌లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీఎస్‌ఎన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ వడ్లమూడి మాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేదలు, కార్మికులు, సామాన్యులకు భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వడ్లమూడి మాధవి మాట్లాడుతూ శ్రీనివాసులు నాయుడు జీవితాంతం సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పేదల మధ్య కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన సందర్భాలను జరుపుకోవడం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు. విద్యా సేవలతో పాటు సామాజిక సేవ కూడా తమ కుటుంబం ఎప్పటికీ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు వసంతాల రాజా, వీఎస్‌ఎన్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments