EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంగా డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు సేవాలు  

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 20:

 

శ్రీకాళహస్తి భానుడి భగభగలతో నిప్పుల కొలిమిని తలపిస్తున్న వేసవి ఎండల్లోనూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ముక్కంటి భక్తుల సేవలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ యల్లంపాటి కోటేశ్వర బాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి భక్తులకు ఉపశమనం కలిగించడమే ధ్యేయంగా ఆయన బుధవారం శ్రీకాళహస్తిలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఉష్ణోగ్రతల హెచ్చరికల నేపథ్యంలో అండగా ప్రస్తుత ఈ నెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఆలయ పరిసర ప్రాంతాలలో ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆయన స్వయంగా నిలబడి భక్తులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సుదీర్ఘ సేవా కార్యక్రమంలో సుమారు 536 మంది ముక్కంటి భక్తులకు, పాదచారులకు చల్లటి మజ్జిగను అందించి వారి దాహార్తిని తీర్చారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో అమృతం లాంటి చల్లటి మజ్జిగను అందించిన డాక్టర్ కోటేశ్వర బాబు సేవా నిరతిని భక్తులు హృదయపూర్వకంగా అభినందించారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, తన నిరంతర సేవా కార్యక్రమాల ద్వారా డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు నిరూపిస్తూ వస్తున్నారు. సేవలోనే దైవాన్ని చూసే అలవాటు ఉన్న ఆయన, ఇలాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో భక్తులకు అండగా నిలవడం తన బాధ్యతగా భావించారు. నిప్పుల కొలిమి లాంటి ఎండలను సైతం లెక్కచేయకుండా, భక్తుల సౌకర్యం కోసం ఆయన చేసిన ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం స్థానికంగా, భక్తుల నడుమ విశేష ప్రశంసలు అందుకుంటోంది. ఎండ తీవ్రత ముగిసే వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!