EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి  18000 నగదు స్వాధీనం 14 మంది అరెస్ట్  కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ 

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే10:

 

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం జీడిగుట్ల గ్రామ పరిధిలో పేకాట స్థావరాల పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాళ్ళబుదుగూరు ఎస్సై నరేష్ తన సిబ్బందితో కలసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ముందుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు డ్రోన్ కెమెరాల సాయంతో పేకాట స్థావరాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోనికి తీసుకుని, వారి వద్ద నుండి 18 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్టు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!