
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే09:
సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ అత్త సుశీలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో పార్టీ నాయకులు శనివారం ఆయనను పరామర్శించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్, గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్ కుమార్, పెంచలకోన దేవస్థానం ట్రస్టు మండలి మాజీ అధ్యక్షుడు తానంకి నానాజీ సూళ్లూరుపేటలోని ఆకుతోట రమేష్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సుశీలమ్మ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ఆమె మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. పార్టీకి ఆకుతోట రమేష్ అందిస్తున్న సేవలను నాయకులు అభినందిస్తూ ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆకుతోట రమేష్ అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Recent Comments