
వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే09:
వెదురుకుప్పం మండలం బలిజమొండి వెంగనపల్లి గ్రామానికి చెందిన అంగనవాడి ఉపాధ్యాయురాలు జ్యోతి అత్త నిలమ్మ నిన్న ఆకస్మికంగా మృతి చెందింది. ఈ నేపథ్యంలో శనివారం ఆమె భౌతికకాయానికి వెదురుకుప్పం తెలుగుదేశం మండల అధ్యక్షుడు మోహన్ మురళి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిలమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Recent Comments