EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

బీసీ సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులుగా శెంజిగరం వెంకటరమణయ్య

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి జాతీయ బీ.సి. సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య  జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులుగా శెంజిగరం వెంకటరమణయ్య ఎస్.వి. రమణ ని నియమించారు. నెల్లూరు పట్టణంలోని యాదవ ట్రస్ట్ భవన్ లో జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఆర్. కృష్ణయ్య  చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.వి. రమణ  మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య  నాపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది. నాపై విశ్వాసం ఉంచిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని బీసీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం వద్దకు చేరుకుని ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!