EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

కూర్మానిపల్లిలో మహిళలపై దారుణ దాడి

📰 Generate e-Paper Clip

 

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 27:

 

చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలోని కూర్మానిపల్లి గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో ఇద్దరు మహిళలపై విచక్షణారహితంగా దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రభావతి మరియు ఆమె చెల్లెలు సీతపై పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు ఐదుగురు కంటే ఎక్కువ మంది పాల్గొని మహిళలపై దాడి చేసినట్లు బాధితురాలు సీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి కారణంగా ప్రభావతి, సీతలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కుప్పంలోని పీ.ఈ.ఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. భూ వివాదాల కారణంగా జరిగిన ఈ దాడిపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో  తెలియాల్సి ఉంది.

 

 

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!