EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

బాల్యవివాహాల నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహణ కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్

📰 Generate e-Paper Clip

శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 25:

 

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో బాల్యవివాహాల నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాజాతర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, రాళ్లబుదుగూరు ఎస్.ఐ నరేష్ సిబ్బందితో కలిసి హాజరై ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిన్నారులపై లైంగిక దాడుల నివారణ చట్టం, మంచిస్పర్శ చెడ్డస్పర్శ, మైనర్ బాలికల వివాహాల నిషేధం, మహిళల భద్రత, రహదారి భద్రతా నియమాలు వంటి అంశాలపై వివరించారు. బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని, అలాంటి సంఘటనలు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో అవగాహన పెంపొందించడం ద్వారా ఇలాంటి సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!