EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఘనంగా కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేష్ జన్మదిన వేడుకలు 

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 24:

 

కుప్పంపట్టణంలో మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను మరింత ఆకర్షణీయంగా నిలిపారు. వేడుకల సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వెంకటేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు సమర్పించి, కేక్ కట్ చేసి జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు ప్రసంగిస్తూ వెంకటేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న వెంకటేష్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తూ మంచి నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!