EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

మహిళల భద్రత, గంజాయి నియంత్రణపై పోలీసుల ప్రత్యేక చర్యలు  డి.ఎస్.పి పార్థసారథి 

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మహిళలపై నేరాల నివారణతో పాటు గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కుప్పం డి.ఎస్.పి పార్థసారథి తెలిపారు. మహిళల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, అత్యాచారాలు, వేధింపులు, బాలలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, విద్యాసంస్థలు, గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతను చైతన్యపరచేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నట్లు చెప్పారు. గంజాయి విక్రయాలు, రవాణాపై కఠిన నిఘా పెట్టి, నిందితులపై కేసులు నమోదు చేయడంతో పాటు చక్కగా ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు 112, 181, 100 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా బాలల హెల్ప్‌లైన్ 1098, గంజాయి నియంత్రణకు 14500, సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజల సహకారం అవసరమని, పోలీసులతో కలసి పనిచేస్తేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని డి.ఎస్.పి పిలుపునిచ్చారు. ముఖ్యంగా ధైర్యస్పర్శపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నేడు ప్రత్యేక వాహనాలను ప్రారంభించినట్టు డి.ఎస్.పి తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!