EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

కుప్పం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వార్షికోత్సవం

📰 Generate e-Paper Clip

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:

 

 

కుప్పం కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో నాలుగవ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేలూరు నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వి ప్రభా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ వి ప్రభా మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి సేవాభావం, బాధ్యతల సమ్మేళనమని పేర్కొన్నారు. విద్యార్థులు సమాజానికి సేవ చేసే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ ఎన్ సునీల్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు తమ నర్సింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తమ విభాగాల్లో నైపుణ్యం సాధించి ఉత్తమ నర్సులుగా ఎదగాలంటే పునాది నుంచి శిఖరం వరకు ప్రతి మెట్టును క్రమంగా అధిగమించాలని సూచించారు. శాంతా నాగరాజు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్ వి విమల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!