EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

కుటుంబాన్ని పరలోక పాలు చేసిన రోడ్డు ప్రమాదం…  మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్న స్థానికులు.

📰 Generate e-Paper Clip

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:

 

వి.కోట మండలంలోని కృష్ణాపురం పంచాయతీ కొమ్మరమడుగు వద్ద రాత్ర సుమారు 9:20 గంటల ప్రాంతంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అభం శుభం తెలియని చిన్నారితో పాటు తల్లి, తండ్రి ముగ్గురు అశువుల బాసర్. వివరాల్లోకి వెళితే.. వి.కోట మండలం ఎడగురికి గ్రామానికి చెందిన హేమచంద్ర 40, సరస్వతి 35,కుమారి లలిత 10 సంవత్సరాలు, వీరు ముగ్గురు నిన్నటి దినం బైరెడ్డిపల్లి మండలంలోని వారి బంధువుల గృహంలో శుభకార్యానికి వెళ్లి కార్యక్రమం తర్వాత రాత్రి తిరిగి వస్తుండగా.. సరిగ్గా కొమ్మరమడుగు గ్రామంలోని మలుపుల వద్దకు రాగానే వీకోట వైపు నుండి పలమనేరు వైపుగా వెళుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన టిఎన్ 52, ఎల్ 0412 గల లారీ వాహనము డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగముగా ప్రయాణిస్తూ ద్విచక్ర వాహన దారులపైకి దూసుకువెల్లగా ఘోర ప్రమాదం సంభవించి వారు అక్కడికక్కడే వివిధ జీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వగా, 108 సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రమాద స్థలానికి వెళ్లి విగత జీవులగా పడి ఉన్న వారి ముగ్గురిని వెంటనే వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి త్వరితగతిన ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం వారిని వెంటనే కుప్పం మెడికల్ కళాశాలకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే హేమచంద్ర, సరస్వతి చనిపోవుగా, వారి కుమార్తె లలిత ను పి ఈ ఎస్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆ బాలిక చికిత్స పొందుతూ ఈరోజు మరణించిందని సమాచారం తెలిసినది. ఈ ప్రమాదంపై స్పందించిన వీకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!