
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అభయ శంకరుని ఆలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన నిండు నూరేళ్ళు ఆయురా రోగ్యాలతో వర్ధిల్లుతూ, రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని అభయ శంకరునికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ పురోహితులచే చంద్రబాబు నాయుడు నామధేయంపై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments