EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పెనుమూరు తహసీల్దారు కార్యాలయానికి నూతన శోభ: రూ. 5 లక్షలతో మరమ్మతులు

📰 Generate e-Paper Clip

 

పెనుమూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్ఏ,ప్రిల్ 20:

 

 

పెనుమూరు మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం సరికొత్త రూపు సంతరించుకుంది. జిల్లా కలెక్టర్ గారు కేటాయించిన రూ. 5 లక్షల నిధులతో కార్యాలయం మొత్తాన్ని ఆధునీకరించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మండల రెవెన్యూ అధికారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఈ పునఃప్రారంభ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎంఆర్ఓ తో పాటు రెవెన్యూ సిబ్బంది, మండల కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మరమ్మతులు పూర్తి చేసుకున్న భవనాలను, గదులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిధులను వినియోగించి ఆధునీకరణ పనులు పూర్తి చేసినట్లు ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ తెలిపారు. కార్యాలయం కొత్త కళను సంతరించుకోవడం పట్ల స్థానిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!