EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఎమ్మెల్యేను సన్మానించిన రాధాబంగ్లావాసులు

📰 Generate e-Paper Clip

పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,ఏప్రిల్ 18

 

పలమనేరు మున్సిపల్ పరిధిలోని రాధాబంగ్లా వాసులు శనివారం పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డిని కలసి ఘనంగా సన్మానించారు. గత నెలలో రాధా బంగ్లా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేను ఆలయ నిర్మాణానికి స్థలం కావాలని స్థానికులు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి స్థానికులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రెండు సెంట్లు స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం అధికారులు కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ రాధా బంగ్లా వాసులు ఎమ్మెల్యేను కలిసి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతవాసులు జగదీష్ నాయుడు, రామ్మూర్తి నాయుడు,రాఘవ తదితరులు పాల్గొన్నారు..

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!