
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 07:
చిత్తూరుజిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ జన్మదినం సందర్భంగా కుప్పంలోని అన్న కాంటీన్లో పేదలకు ఉచిత భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా సుమారు ఐదు వందల మందికి భోజనం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా తక్కువ ధరకు అందించే భోజనాన్ని ఈ సందర్భంగా పూర్తిగా ఉచితంగా పంపిణీ చేశారు. గోపీనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనాన్ని స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, నాయకులు ఆర్ ఆర్ రవి, కౌన్సిలర్లు సోము, జాకీర్ భాష, వేణు, మంజునాథ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యువ నాయకుడు హర్షధర్మతేజ్ కూడా పాల్గొని సేవా కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాడు.


Recent Comments