
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 07:
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ పరిధిలోని కెనమాకులపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉండడంతో వేలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో చిన్న వయసులోనే భక్తులను ఆకట్టుకుంటున్న అశ్విత్ భరత్ వాజ్ కూడా పాల్గొననున్నాడు.


Recent Comments