EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

గ్రామస్తులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన రూరల్ సీఐ మల్లేష్ యాదవ్

📰 Generate e-Paper Clip

గుడిపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 06:

 

కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సంగనపల్లి గ్రామంలో సోమవారం రాత్రి గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. కుప్పం రూరల్ వలయ అధికారి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రతపై సూచనలు అందించారు. ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు నిషేధితమని, అలాంటి సంఘటనలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే నష్టాలను వివరించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ చిన్నపిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా పలు సూచనలు చేశారు. గ్రామస్తులు చట్టాలను గౌరవించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!