
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 06:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఆహార,పౌరసర ఫరాలు,వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి,జనసేన పార్టీ రాజకీయ వ్యవహా రాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు కుప్పం పట్టణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ధర్మకర్త మండలి సభ్యులసహకారం లభించింది. ఈ సందర్భంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి,బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. భక్తులు, ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పవన్,మహేష్,హరీష్, బాలాజీ, కిషోర్,పవన్ కుమార్,హంసగిరి,పాండు, మంజునాథ్, సురేష్,చంద్ర,దేవా,వెంకటేష్,విజయ్, నవనీత,హేమ,సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments