EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

శ్రీకాళహస్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  సర్ ప్రక్రియ పై సమీక్ష సమావేశం

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి  ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో  సర్ ప్రక్రియ పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అంశాలు మరియు పార్టీ శ్రేణుల భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ  మద్దెల గురుమూర్తి
మాట్లాడుతూ సర్ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీనిని క్షేత్రస్థాయిలో పూర్తి పారదర్శకతతో, సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి నిరంతరం అందుబాటులో ఉండాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి  నాయకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇదే ఉత్సాహంతో ఈ ప్రక్రియను విజయవంతం చేసి, ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిశీలకులు మరియు రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గున్నేరి కిషోర్ రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, వైయస్సార్సీపీ శ్రేణులు , లీగల్ సెల్ టీం , రిటైర్డ్ టీచర్  పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!