EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

రేణిగుంట విమానాశ్రయంలో ‘యాత్రి సువిధా దివస్’ – ప్రయాణికులకు ప్రత్యేక సేవలు

📰 Generate e-Paper Clip

 

రేణిగుంట,చిత్తూరు ఎక్సప్రెస్, జూన్ 15 :

 

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎఎఐ) ఆధ్వర్యంలో తిరుపతి విమానాశ్రయంలో సోమవారం “యాత్రి సువిధా దివస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులకు ప్రత్యేక స్వాగతం పలుకుతూ తిలకం దిద్దారు.ఈ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ సహకారంతో రక్తదాన శిబిరం,ఉచిత ఆరోగ్య పరీక్షలు,కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు.తపస్య విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే నాటిక,నృత్య ప్రదర్శనలు చేశారు.అదేవిధంగా విమానాశ్రయ అభివృద్ధిని ప్రతిబింబించే పాత ఫొటోల ప్రదర్శన,విమానయాన రంగంలోని ఉద్యోగ అవకాశాలపై బ్యానర్లు ఏర్పాటు చేశారు.ప్రయాణికుల అభిప్రాయాల సేకరణ కోసం సెల్ఫీ పాయింట్లు,ఫీడ్‌బ్యాక్ డ్రైవ్‌ను కూడా నిర్వహించినట్లు విమానాశ్రయ డైరెక్టర్ డి.బూమినాథన్ తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!