EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

శివరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ గ్రేస్ మేరియా చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 24:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురానికి చెందిన గ్రేస్ మేరియా చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం, జట్టు భావన, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ట్రస్టీ ఆరోకియా రాజ్, సెక్రటరీ జేసుమారి మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని, ఇలాంటి సేవా కార్యక్రమాలను ట్రస్ట్ భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అబ్దుల్లా,వరుణ్ జాకబ్, చేతన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.గోపాలకృష్ణ,ఉపాధ్యాయుడు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ అందించిన క్రీడా దుస్తులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థుల అభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!