విజయవాడ,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 06:.
డా బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సమాచార హక్కు కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం–2005 పై అవగాహన సదస్సు,సభ్యుల పరస్పర సమావేశం విజయవాడలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైల్వే స్టేషన్ సమీపంలోని గోల్డెన్ వే హోటల్‌లో జరుగనుంది. సదస్సులో సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కల్పించడం, ప్రజల హక్కులపై చర్చించడం, సభ్యుల అనుభవాలను పంచుకోవడం, ప్రజలకు ఉపయోగపడే మార్గదర్శకాలను వివరించడం వంటి అంశాలు ప్రధానంగా చర్చించబడతాయి. ప్రజలు, సమాచార హక్కు కార్యకర్తలు, యువత,ఆసక్తి గలవారు ఈ సదస్సులో పాల్గొని విజ్ఞానాన్ని పొందాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సం ప్రదించవలసిన సంఖ్యలు: 9951895211, 9849504635, 9700143423, 9848531097


Recent Comments