EPAPER
Sunday, October 18, 2026
Google search engine

వర్మ కుటుంబానికి ఎమ్మెల్యే థామస్ పరామర్శ ఆర్థిక సహాయం అందించి భరోసా

📰 Generate e-Paper Clip

వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్ , అక్టోబర్04:

 

వెదురుకుప్పం మండలం గొడుగుచింత పంచాయతీ పరిధిలోని గొడుగుచింత గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎన్. వర్మ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే థామస్, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. వర్మ మృతి పార్టీకి, స్థానికంగా టీడీపీ శ్రేణులకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్న యుగంధర్, మండల టీడీపీ అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గుండయ్య, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బట్టే చాణిక్య ప్రతాప్, నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మరకాలకుప్పం సుధాకర్, సర్పంచ్ కటారి మోహన్, సీనియర్ టీడీపీ నాయకుడు తాతిరెడ్డి జైచంద్రారెడ్డి, మధు, సునీల్, వెంకటేష్ నాయుడు, దాము, చిరంజీవి నాయుడు, రాజాజీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!