EPAPER
Sunday, October 18, 2026
Google search engine

మెగా పీటీఎంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పదో తరగతి టాపర్లను సత్కరించిన టీడీపీ నాయకులు

📰 Generate e-Paper Clip

గుడుపల్లి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 24:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లిమండలంలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను నగదు ప్రోత్సాహకాలతో సత్కరించారు. కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడుపల్లిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినికి గుడుపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం (సుబ్బు) రూ.5,000 నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. అలాగే ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థినికి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వి. సురేష్ రూ.3,000 నగదు బహుమతిని అందించి అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మంది విద్యార్థులకు స్ఫూర్తి కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!