చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 09:
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును బిజెపి కుప్పం ఇంచార్జ్ డా.ఎన్.ఎస్. తులసీనాథ్ చిత్తూరులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజా జీవితం, రాజకీయ పరిస్థితులు, సేవా కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా,కేంద్ర మంత్రిగా,పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి ప్రజా జీవితంలో విశేష సేవలందించిన వెంకయ్య నాయుడు సనాతన ధర్మానికి ప్రాధాన్యం ఇస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని తులసీనాథ్ తెలిపారు. వెంకయ్య నాయుడు సూచించిన మార్గంలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తులసీనాథ్ పేర్కొన్నారు.


Recent Comments