EPAPER
Sunday, October 18, 2026
Google search engine

బిజిగానిపల్లిలో స్టార్ క్రాకర్స్ షాపు తనిఖీ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  డీఎస్పీ పార్థసారథి సూచనలు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 12:

 

కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడుపల్లి మండలం బిజిగానిపల్లి గ్రామంలో ఉన్న స్టార్ క్రాకర్స్ షాపును కుప్పం డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా షాపులో ఉన్న క్రాకర్స్ స్టాక్‌ను వారు పరిశీలించి, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని తనిఖీ చేశారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షాపు నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రత్యేకంగా క్రాకర్స్ నిల్వ విషయంలో భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే షాపులో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని, అనుమతించిన పరిమితిలోనే స్టాక్ నిల్వ ఉంచాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!