
వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 02:
వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి గ్రామపంచాయతీ లో గురువారం వికసిత్ భారత్ జి-రామ్‌జీ పథకం కింద 125 రోజుల ఉపాధి హామీ పనులను ఘనంగా ప్రారంభించారు. స్థానిక రైతు దివంగత బండి రామచంద్రా రెడ్డి సతీమణి తులసి పొలంలో టెంకాయ (కొబ్బరి) మొక్కలు నాటడం ద్వారా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే విధంగా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి శశి ఆనందరెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు బోడిరెడ్డి చంగల్పన్రెడ్డి, టీడీపీ యూనిట్ ఇన్చార్జి కె. తిరుమల్‌రెడ్డి, ఉపాధి హామీ రైతులు బండి జనార్దన్‌రెడ్డి, కుమ్మతల కృష్ణారెడ్డి, బండి కాంతారావు, ప్రసన్న, శ్యామల తదితరులు పాల్గొన్నారు.


Recent Comments