
వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే 24:
వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయితీ పరిధిలోని రెంటాలచేను గ్రామానికి చెందిన చెంచుగుడి మహాభారతం ఆలయ ధర్మకర్తలు వెంకటరమణారెడ్డి, పట్టాభిరెడ్డి తల్లి పూల శాంతమ్మ ఇటీవల మృతి చెందగా, ఆదివారం ఆమె స్వగృహంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు నివాళులర్పించారు. శాంతమ్మ భౌతికకాయాన్ని సందర్శించిన వెదురుకుప్పం టిడిపి మండల అధ్యక్షుడు మోహన్ మురళి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేవరాజులనాయుడు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చెంగల్రాయిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ వరప్రసాద్, సింగిల్ విండో డైరెక్టర్ మనోహర్‌నాయుడు, మండల టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి చిరంజీవినాయుడు, మండల టిడిపి కార్యదర్శి మొగిలయ్య, యూనిట్ కన్వీనర్ కిరణ్ యాదవ్, బూత్ కన్వీనర్ కుమార్, సీనియర్ నాయకులు లోకనాథ్‌రెడ్డి, ప్రకాష్‌నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, చిరంజీవి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. గ్రామస్థులు, బంధువులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


Recent Comments