EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

డీఆర్‌ఎం కప్ మీట్–2026లో సత్తా చాటిన  రేణిగుంట ఆర్‌పీఎఫ్ సిబ్బంది 

📰 Generate e-Paper Clip

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 24:

 

గుంటకల్‌లో నిర్వహించిన డీఆర్‌ఎం కప్ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ డివిజనల్ స్పోర్ట్స్ మీట్–2026 పోటీలలో రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) రెణిగుంట సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి విశేష విజయాలు సాధించారు.వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొన్న రెణిగుంట ఆర్‌పీఎఫ్ సిబ్బంది తమ ప్రతిభతో ఆకట్టుకుని శాఖకు గౌరవం తీసుకువచ్చారు. పురుషుల విభాగంలో ఎన్.వెంకటేశ్వర్లు ఐపీఎఫ్/ఆర్‌యూ, శ్రీ బి.సుధాకర్ హెచ్‌సీ/రేణిగుంట జోడీ బ్యాడ్మింటన్ పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలిచారు. అలాగే ఎం. శ్రీనిష్, ఎస్‌ఐ/రేణిగుంట గుంటకల్ తరఫున క్రికెట్ పోటీలలో పాల్గొని జట్టు విజయానికి తన వంతు సహకారం అందించారు.మహిళల విభాగంలో రెణిగుంట కానిస్టేబుల్ కుమారి అంజనాదేవి 200 మీటర్లు, 400 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానాలు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.మరో కానిస్టేబుల్ కుమారి ద్రాక్షాయణి 100 మీటర్లు, 400 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. అదేవిధంగా అంజనాదేవి,ద్రాక్షాయణి కలిసి పాల్గొన్న 4×100 మీటర్ల రిలే పోటీలో ప్రథమ స్థానం సాధించి రెణిగుంట ఆర్‌పీఎఫ్‌కు గర్వకారణంగా నిలిచారు.ఈ విజయాలు గుంటకల్ డీఎస్సీ ఆకాశ్ కుమార్ జైస్వాల్ పర్యవేక్షణలో,అలాగే ఏఎస్సీ/రేణిగుంట కె.రాజగోపాల రెడ్డి ప్రత్యేక ప్రోత్సాహం, మార్గదర్శ కత్వంతో సాధ్యమయ్యాయని అధికారులు తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో అధికారులు విశేష కృషి చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది విజేతలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!