EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పదోతరగతి విద్యార్థులు బాగా చదువుకుంటే వారి జీవితం ఉజ్వల భవిష్యత్..  జనసేన ఇంచార్జ్ యుగంధర్  అన్ని సబ్జెక్టులో 100కు 100 సాధిస్తే 50 వేల రూపాయలు అందిస్తా.. జనసేన ఇంచార్జ్ యుగంధర్

📰 Generate e-Paper Clip

ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి14:

 

పదవ తరగతి విద్యార్థులు బాగా చదువుకుంటే వారి జీవితం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ పొన్నా యుగంధర్ అన్నారు. శనివారం ఎస్ఆర్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 80 మంది పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్ పెన్సిల్ స్కేల్ ను పుల్లూరు సర్పంచ్ భవ్య పవన్ జనసేన ఇంచార్జి యుగంధర్ విద్యార్థులకు అందించారు. అలాగే పుల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్ పెన్ను పెన్సిల్ స్కేల్ అందించారు పదవ తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 100 కు 100మార్కులు సాధిస్తే ఆ విద్యార్థులకు 50 వేల రూపాయలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందిస్తామని జనసేన ఇన్చార్జి డాక్టర్ పొన్నా యుగంధర్ తెలిపారు. కావున విద్యార్థులందరూ బాగా చదువుకుని బాగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి ఉపాధ్యక్షుడు చందు చార్లెస్ హరి వీర మహిళ సుబ్బలక్ష్మి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!