EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

కుప్పం నియోజకవర్గంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 14:

 

జనసేనపార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుప్పంనియోజకవర్గం గుడు పల్లి మండలం చీకటిపల్లి పంచాయతీ పచార్లపల్లి గ్రామంలో ఘన వేడుకలు జరిగాయి. కార్యక్రమం ఆధ్వర్యంలో నరేష్ నియోజకవర్గ ఇంచార్జ్, కాణిపాక ఆలయ ధర్మకర్తమండలి సభ్యుడు నరేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర,జిల్లా నాయకులు, మండల కార్యవర్గసభ్యులు,ఉద్యములు, సాధకులు, అభిమానులు పాల్గొన్నారు. ముందుగా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పచార్లపల్లిలో జెండా ఘనంగా ఎగరవేసి,కేక్ కటింగ్, అన్నదా నం కార్యక్రమాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ ప్రశంసలు నరేష్ మాట్లాడుతూ.. ముళ్ల దారిలో ధైర్యంగా ముందుకు నడిచి చూపిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర పూర్తి కాదని, ఇప్పుడు జ్వాలలా వెలుగుతూ ప్రభంజనంలా విస్తరిస్తోందని పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ అడుగుజాడ ల్లో కార్యకర్తలు నడవాలి,స్థానిక ఎన్నిక ల్లో కూటమితో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు, సభ్యత్వాలు నారా చంద్రబాబు నాయుడు అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చేయాలి, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారం చేయా లని సూచించారు. 500కి పైగా సభ్యత్వా లు నమోదుచేసిన నాయకులు, కార్యకర్త లు, వీరమహిళలను సన్మానించారు. పాల్గొన్నవారు అమీర్, పవన్, మహేష్, హరీష్, బాలు, రామమూర్తి, వేణు, నవీన్, వామనమూర్తి, మంజునాథ్, సురేష్, హంసగిరి, గణేష్, కుమారేశ్, చంద్రశేఖర్, పాండు, రూపేష్, నవనీత, దివ్య, హేమ, సరస్వతి, కుసుమ, పవన్ కుమార్, భాస్కర్, శ్రీకాంత్, అంజి, హరికుమార్ చంటి, చంద్ర, దేవా వెంకటేష్, శ్రీధర్, సుబ్రమణ్యం, గోవింద్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!